గొల్లపల్లి, ముద్ర విలేకరి: అంగన్ వాడీ కేంద్రాలు బలోపేతానికి అంకిత భావంతో కృషి చేయాలని సూపర్వైజర్ జానకి తెలిపారు.జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలో గోవిందుపల్లి,లక్ష్మీ పూర్ గ్రామాల్లో సూపర్వైజర్ జానకి ఆధ్వర్యంలో మంగళవారం అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్రంల్లో అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించిన్నారు.ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ.ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా పిల్లలకు టీచర్ల విద్యా బోధన అందించాలని సూచించారు. అంగన్ వాడీల బలోపేతం చేసేలా మూడు సంవత్సరాలు పూర్తి అయిన పిల్లల అందరిని కేంద్రాల్లో చేర్పించాలని,పిల్లలు తల్లిదండ్రులకు విద్య పై ఆమె అవగాహన కల్పించారు. ప్రీస్కూల్,ఎల్ కెజీ నుంచి యూకేజీ వరకు బుక్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఆటపాటలతో కూడిన విద్య చెబుతున్నామని సూపర్వైజర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జానకి, అంగన్వాడి టీచర్ సరోజ, పద్మ,స్వప్న, ఆయాలు ఆశ కార్యకర్త విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు పూర్ణచందర్ రమేష్,తదితరులు పాల్గొన్నారు.
