ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
తాండూరు మండలంలో రైతులకు ఊరట కలిగించే విధంగా PACS ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. కూచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతులు, సంఘ ప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు తగిన ధర లభించి, వారి ఆదాయం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన పత్రాలను లబ్ధిదారులకు అందజేసి, వారి ఆనందంలో భాగస్వామ్యమయ్యారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ రామచంద్ర రెడ్డి, సర్పంచ్ మల్లయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, డైరెక్టర్లు, రైతులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.