Take a fresh look at your lifestyle.

గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు, అవార్డు రావడం మరింత బాధ్యతను పెంచింది అవార్డు గ్రహీత, దాయం ఝాన్సీ రాజిరెడ్డి 

 

ముద్ర.తుంగతుర్తి :

గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలు స్థాపించి  జ్ఞాన వెలుగులు పంచేందుకు నిరంతరం కృషి చేస్తున్న తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన దాయం ఝాన్సీ రాజిరెడ్డికి సోమవారం హైదరాబాదులో నీ రవీంద్రభారతిలో విపంచి ఫౌండేషన్ చైర్మన్ అనుమల శ్రీనివాస్ ,తెలంగాణ భాష సంస్కృతి శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి చేతుల మీదుగా ఉగాది పురస్కారం  అవార్డు అందుకున్నారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని అన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో విజ్ఞాన వెలుగులు నింపేందుకు తాను నిరంతరం కృషి చేస్తున్నానాని అన్నారు, గ్రామంలోని గ్రంథాలయం అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు, అవార్డు అందుకోవడం వల్ల తనకు సామాజిక బాధ్యత మరింత పెరిగింది అన్నారు, గ్రంథాలయాల ద్వారా విద్యార్థులు యువత చదువుపై ఆసక్తి పెంపొందించుకోవాలన్నారు, భవిష్యత్తులో మరిన్ని గ్రామాల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు తన వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు , గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత పోటీ పరీక్షలకు సిద్ధం అగుటకు వివిధ రకాల పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు ,పుస్తకాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపేందుకు   ఇందులో పాఠకులందరూ చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు . ప్రస్తుతం తాను ఈ గ్రంథాలయానికి  చైర్మన్ గా కొనసాగుతూ వారి ఆశయాలను ముందుకు తీసుకు వెళుతున్నట్లు తెలిపారు,  గ్రామీణ ప్రజలకు విద్య, అవగాహన, విజ్ఞానం అందించాలనే సంకల్పంతో గ్రంధాలయంలో విద్యార్థులు, యువతకు అవసరమైన పుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్, సామాజిక అంశాలపై అవగాహన కలిగించే గ్రంథాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు , ముఖ్యంగా గ్రామీణ యువతలో చదువుపై ఆసక్తి పెంచడం, ఉన్నత లక్ష్యాల వైపు దారి చూపించడం ఈ గ్రంథాలయం ముఖ్య లక్ష్యంగా కొనసాగుతోంది అని అన్నారు

భాష సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో విపంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాదులోని రవీంద్ర భారతీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ పరాభావ నామ ఉగాది పురస్కారాన్ని ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు

.ఈ కార్యక్రమానికి విపంచి ఫౌండేషన్ చైర్మన్ అనుముల శ్రీనివాస్, తెలుగు భాషా సాంస్కృతిక శాఖ  సంచాలకులు కవి విమర్శకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నా మోజు బాలా చారి, ఉమ్మడి నల్లగొండ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గాదె వినోద్ రెడ్డి, విపంచి ఫౌండేషన్ గౌరవ సలహాదారు ఆందోజు నాగభూషణం, సోషల్ డెవలప్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గుండ్ల మదన్, కల్లూరి సుజాత ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కల్లూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.