Take a fresh look at your lifestyle.

నాగర్‌కర్నూల్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం – ట్రాన్స్‌ఫార్మర్‌కు శ్రీకారం

 

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను స్థానిక శాసనసభ్యులు డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం అదే వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్లు శ్రీనివాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.