- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
- వన మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్.
- లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన విప్.
కోరుట్ల/కథలాపూర్, ముద్ర విలేఖరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సోమవారం రోజు జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కథలపూర్ మండలం అంబారిపేట గ్రామంలోని శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి దేవాలయ ఆవరణలో మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. కథలాపూర్ మండలం పరిధిలో ఇటీవల మంజూరి అయిన 14 లక్షల విలువ గల 35 ముఖ్యమంత్రి సహాయానికి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ పాటు పడాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దానిని పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని అన్నారు.25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రూపాయల జమ చేశామని, రైతు భరోసా క్రింద పెట్టుబడి సహాయం ఎకరానికి 12 వేల రూపాయలకు పెంచి 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయల జమ చేశామని అన్నారు. రైతు బీమాకు 3 వేల కోట్ల అందించామని అన్నారు. త్వరలోనే ఉమ్మడి మేడిపల్లి కథలాపూర్ మండల ప్రజల చిరకాల వాంఛ కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ నిర్మాణం పూర్తి అవుతుందని, ఇప్పటికే సుమారు 6 కోట్ల పైబడి రూపాయలతో పనులు జరిగాయని మిగతా పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు.విప్ వెంట మార్కెట్ చైర్మన్ పూండ్ర నారాయణరెడ్డి, కమిటీ సభ్యులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాయితీ నాగరాజు, పులి హరిప్రసాద్ కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు ధ్యానవేని మల్లేష్ 20 మంది తో కలసి కాంగ్రెస్ పార్టీలో సోమవారం చేరగా వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
