Take a fresh look at your lifestyle.

అధికారులు,ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి- మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనుచౌదరి

 

ముద్ర, మేడ్చల్ జిల్లా ప్రతినిధి :

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి సూచించారు.
గురువారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై నూతన మున్సిపల్ చైర్ పర్సన్లు కౌన్సిలర్లు, అధికారులకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఒక రోజు అవగాహాన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఫైజాన్ అహ్మద్, అదనపు కలెక్టర్ రెవిన్యూ విజయేందర్ రెడ్డి, డి ఆర్ ఓ చంద్రవతి, ట్రాఫిక్ ఏ సి పి వెంకట్ రెడ్డి, జిల్లా మార్కేంటింగ్ ఛైర్మన్ నిర్సింహయాదవ్, జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టిఎ కమీషన్ సభ్యులు జైపాల్ రెడ్డి లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 6 నుండి ప్రారంభమైనఈ కార్యక్రమం జూన్ 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని తెలిపారు.99 రోజుల కార్యక్రమంలో 5 స్థాయిలలో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలలో 10 థీమ్స్ గురించి కలెక్టర్ వివరించారు. కీలకమైన ప్రజా సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎంపిక, అర్హతలు పరిశీలించి అధికారులు క్లుప్తంగా వివరించాలని సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని 99 రోజులపాటు దిగ్విజయం చేసేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు.
99 రోజులపాటు పది అంశాలతో నిర్వహిస్తున్న కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 2న గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించి ఇందులో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజాప్రతినిధులు కీలకంగా ఉండాల్సినందున వారికి సమగ్రంగా అవగాహన కల్పించేందుకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఏమైనా సందేహాలు ఉంటే అధికారుల దృష్టికి తేవాలని సూచించారు.అనంతరం విద్యా, వైద్య, వ్యవసాయం, మహిళ యువత సంక్షేమం పర్యావరణం, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాల పై తమ తమ శాఖల ద్వారా నిర్వహించే కార్యక్రల పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. పోలీస్, రవాణ, ట్రాఫిక్, ఆర్టీసి శాఖల తరపున డ్రగ్స్ నియంత్రణ, రహదారి భద్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వ్యర్థ పదార్థాలను అడవులలో వేయకుండా అడవులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని, మొక్కలను విరివిగా నాటుతూ ప్రకృతిని కాపాడాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
99 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై రూపొందించిన పాటలతో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నూతనంగా ఎన్నికైన ఛైర్మన్లు, వార్డు మెంబర్లు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.