Take a fresh look at your lifestyle.

విజయ్ ఎలక్ట్రికల్స్ సీఎండీ దాసరి జై రమేష్ 80వ జన్మదిన వేడుకలు.. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

 

ముద్ర,హైదరాబాద్ :

విద్యుత్ కాంతులను ప్రజలకు అందించటంలో సరిక్రొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన, విద్యుత్ రంగంలో మహోన్నత శిఖరాలను అందుకున్న విజయ్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సంస్థ CMD శ్రీ దాసరి జై రమేష్ గారి 80వ జన్మదినం సందర్భం గా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని టి.సి.సి క్లబ్ లో విజయ్ ఎలక్ట్రికల్ పూర్వ కార్మికులు, ఉద్యోగులు వారి గౌరవార్థం శ్రీ సాంబమూర్తి గారి ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో నిర్వహించిన రక్తదానం శిబిరాన్ని CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మల్లిఖార్జున గారు, కార్మిక నాయకుడు శ్రీ సుదర్శన్ గార్ల తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ గారు మాట్లాడుతూ విద్యుత్ కాంతులను ప్రజలకు అందించటంలో సరిక్రొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన, విద్యుత్ రంగంలో మహోన్నత శిఖరాలను అందుకున్న విజయ్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సంస్థ CMD శ్రీ దాసరి జై రమేష్ గారి 80వ జన్మదినం సందర్భం గా రక్తదానం శిబిరం ను నిర్వహించడం చాలా అభినందనీయమని, వారికి నా హృదయపూర్వక జన్మదినం శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని, 40 మంది వరకు రక్తదానం చేయడం గొప్ప విషయం అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు, ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపారు అని ,ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని,ప్రాణదాతలు గా నిలవాలని , రక్తదానం చేసే వారు నిండు ప్రాణాలు నిలిపినవారు అవుతారు అని, రక్తదానం చేసే వారు దేవుళ్లతో సమానం అని, PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు. రక్తదానం చేయడం వలన ఇతరుల ప్రాణాలకు అండగా నిలుస్తామని, ఆరోగ్యం వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో సామాజిక దృక్పథంలో రక్త దానం శిబిరం ప్రారంభించడం అభినందనీయమని అదేవిధంగా ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం చాల గొప్ప విషయం అని, పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని PAC చైర్మన్ గాంధీ గారు కొనియాడారు. పేద ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం మంచి కార్యక్రమం అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు .మానవతా దృక్పతం తో ఉచితంగా మందులు పంపిణి చేసి పేదల వద్దకు నాణ్యమైన వైద్యాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యం అని ,ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యము పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని PAC చైర్మన్ గారు తెలియజేసారు. రక్తదానం శిబిరాన్ని నిర్వహించిన నిర్వాహకులను PAC చైర్మన్ గాంధీ గారు ప్రత్యేకంగా అభినదించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో విజయ్ ఎలక్ట్రికల్స్ పూర్వ ఉద్యోగులు, కార్మికులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.