- మిగిలిన రెండు పరీక్షలు ప్రశాంతంగా కొనసాగించాలి.
అచ్చంపేట, ముద్ర: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు, చారకొండ మండలాల్లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలల్లో కొనసాగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాలను శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ తనిఖీ చేశారు.పరీక్ష నిర్వహణ తీరు, విద్యార్థుల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నపత్రాల రికార్డులను పరిశీలించారు.కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను పరిశీలించారు.పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ తీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు.ఈనెల 21న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని, నేడు జరిగిన ఫిజికల్ సైన్స్ పరీక్షను కూడా జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని డిఇఓ తెలిపారు.నాగర్ కర్నూల్ జిల్లాలోని 60 పరీక్ష కేంద్రాలలో 10,584 మంది విద్యార్థులకు గాను 10,556 మంది విద్యార్థులు హాజరయ్యారు. 28 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ తెలిపారు.ఉదయం 8 గంటలకు చారకొండ పోలీస్ స్టేషన్ నుంచి జిల్లాలోని 60 పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంట్ అధికారులతో నేటి పరీక్షల నిర్వహణపై సెట్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.చీఫ్ సూపరింటెండెంట్లు తప్పనిసరిగా పరీక్ష కేంద్రాల్లోని రూములను సందర్శించి సిబ్బందికి రోజువారి సూచనలు అందించాలని సూచించారు.పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లను అనుమతించారాదని ఆయన స్పష్టం చేశారు.పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతత వాతావరణంలో జరుగుతున్నాయని, జిల్లాలో మిగిలిన రెండు పరీక్షల నిర్వహణ సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.అనంతరం చారకొండ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు.విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఆయన వెంట జిల్లా టెస్ట్ బుక్ మేనేజర్ నరసింహులు ఆయా మండలాల మండల విద్యాధికారులు ఉన్నారు.
