Take a fresh look at your lifestyle.

రామంతపూర్ ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాల ఏర్పాటు చేయాలి – మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

 

ముద్ర కాప్రా

ఉప్పల్ రామంతపూర్ ప్రాంతంలోని ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని మాజీ శాసనసభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర బిజెపి నాయకులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం రామంతపూర్ పరిసర ప్రాంతాలలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వివిధ కుల సంఘాల ప్రతినిధులతో కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ, సమాజానికి విశిష్ట సేవలందించిన మహనీయుల జ్ఞాపకార్థం ట్యాంక్‌బండ్‌పై వారి విగ్రహాలను ఏర్పాటు చేయడం అవసరమని పేర్కొన్నారు. స్థానిక ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ భారీ ర్యాలీలో బి జె పి రామ్ ప్రదీప్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వివిధ కుల సంఘాల ప్రతినిధులు తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. కార్యక్రమం శాంతియుత వాతావరణంలో కొనసాగింది.
స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ట్యాంక్‌బండ్ ప్రాంతంలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తే యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.