ముద్ర మల్కాజిగిరి
బడ్జెట్లో బీసీలకు 55వేల కోట్లు కేటాయించాలి,కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని
తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు.తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద మెరుపు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీసీ సబ్ ప్లాన్‌ను తక్షణమే అమలు చేసి, బీసీలకు కేటాయించాల్సిన నిధులను పూర్తిగా విడుదల చేసి, ఆ నిధులను బీసీ వర్గాల అభివృద్ధికే ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు.
రాష్ట్రంలో బీసీ వర్గాలు జనాభాలో అధిక శాతం ఉన్నప్పటికీ, వారికి తగిన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది బీసీ వర్గాల పట్ల అన్యాయం మాత్రమే కాకుండా, వారి హక్కుల ఉల్లంఘన అని అన్నారు.
ఈ ధర్నాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాగోని హరిశంకర్ గౌడ్ , ప్రధానకార్యదర్శి లింగాల గంగాధర్ , జిల్లా పార్టీ అధ్యక్షులు పనగట్ల చక్రపాణి గౌడ్ పాల్గొన్నారు.