Take a fresh look at your lifestyle.

అల్ఫోర్స్ విద్యార్థులకు అద్భుత ర్యాంకులు

ఐఐటీ జేయియి (మెయిన్) బి.ఆర్చ్ & బి. ప్లానింగ్ 2026 ఫలితాలు వెల్లడి

ముద్ర, కరీంనగర్:ఐఐటీ జేయియి (మెయిన్) బి.ఆర్చ్ & బి. ప్లానింగ్ 2026ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

బి.ఆర్చ్ డిగ్రీ ఎస్. శ్రీహిత 174వ ర్యాంకుతో అత్యుత్తమ స్థానంలో నిలవగా, పటేల్ అక్షయ 189వ ర్యాంకు, డి. తనుశ్రీ 227వ ర్యాంకు, వి. రితిక 287వ ర్యాంకు, ఎస్. ఆధ్య 319వ ర్యాంకు సాధించారు. అదేవిధంగా టి. వెంకట నిహిత్ (903), సి.హెచ్. భీమ (1107), ఆర్. నేహగాయత్రి (1719), పి. శ్రీనిధి (1776), పి. హర్షిణి (2325), ఉమైరా సన్నున్ (2626), పి. అక్షయప్రియ (2786) ర్యాంకులు సాధించి సంస్థకు కీర్తి తీసుకొచ్చారు.

బి.ప్లానింగ్ విభాగం వి. ప్రణతి 858వ ర్యాంకు సాధించగా, పి. క్రిష (1281), ఎం. వివేక్ రెడ్డి (1554), ఎం. షాలిని (1757), రహీన్ ఉమేద్ (2448), జి. మహాలక్ష్మి (3053), పి. ఆదిత్యలక్ష్మి (3122) ర్యాంకులు సాధించారు.

రాబోయే ఐఐటీ (అడ్వాన్స్‌డ్) పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో ప్రత్యేక శిక్షణ ఇస్తామని చైర్మన్ తెలిపారు. పటిష్ట ప్రణాళిక, నాణ్యమైన బోధన, నిరంతర పర్యవేక్షణతో పాటు విద్యార్థుల కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని చెప్పారు.

ఇక రాబోయే ఐఐటీ (అడ్వాన్స్‌డ్)లో కూడా అల్ఫోర్స్ విద్యార్థుల ఉత్తీర్ణత ఫలితాలు సాధించి ప్రతిష్టాత్మక ఐఐటీలో సీట్లు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అలాగే బోధనా సిబ్బందిని అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.