- ఉగాది వేళ మరో తీపి కబురు.
- మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి వెల్లడి.
ముద్ర ప్రతినిధి కరీంనగర్ : బెజ్జంకి మండలానికి వ్యవసాయ కళాశాల మంజూరయిందని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.ఉగాది పండగ సందర్భంగా మానకొండూరు మండలం కొండపలకల గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను మానకొండూర్ మంజూరు చేయించుకోగా, ఇప్పుడు వ్యవసాయ కళాశాల కూడా మంజూరైనట్టు ఎమ్మెల్యే వివరించారు.దసరా పండగ రోజున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగా, వ్యవసాయ కళాశాల మంజూరైనట్టుగా తీపి కబురును ఉగాది రోజున ప్రజలకు అందిస్తున్నామన్నారు.బెజ్జంకిలో వ్యవసాయ కళాశాల ఏర్పాటుతో మానకొండూర్ నియోజకవర్గం అభివృద్ధిలో మరో ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహిస్తున్న ఈ వ్యవసాయ కళాశాలను మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలానికి మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఈనెల 28న రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి పల్లి సత్యనారాయణ తెలిపారు. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో బెజ్జంకి మండలంలో పూర్తి స్థాయిలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర అవసరాలతో ప్రభుత్వానికి సమగ్ర ప్రతిపాదనను పంపాలని ఆ ఉత్తర్వులో ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశించారాణి తెలిపారు.బెజ్జంకి మండలానికి వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించడంపై మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి రెండు విద్యాసంస్థలు మంజూరైనట్టుగా ఎమ్మెల్యే చెప్పారు. వ్యవసాయ కళాశాల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తానని ఆయన చెప్పారు. వ్యవసాయ కళాశాలను మంజూరు చేసిన సీఎంకు, ఎందుకు సహకరించిన మంత్రులకు ప్రభుత్వ ఉన్నత అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.మానకొండూర్ నియోజకవర్గంలో అభివృద్ధిని వేగవంతం చేశానని ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. రోడ్డు లేని చోటల్లా రోడ్లు lవేసామని, రోడ్డు నిర్మాణాలలో ఎస్సీ కాలనీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు ఆయన వివరించారు.
- యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన యువ వికాస పథకాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు.ఈ పథకం కింద అర్హులైన వారు దరఖాస్తులు తీసుకోవాలని, ముఖ్యంగా అనుభవం ఉన్న రంగాలకు సంబంధించిన యూనిట్ల కోసమే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
- చెక్కుల పంపిణీ
కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం కింద మంజూరైన చెక్కులను కొండపలకల గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అందజేశారు.