Take a fresh look at your lifestyle.

కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేస్తున్న మండల నాయకులు…….

 

ముద్ర నడిగూడెం……

పెదింటి ఆడపడుచులను ఆదుకోటమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని నడిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు
భూత్కూరి వెంకటరెడ్డి, నడిగూడెం సర్పంచ్ దున్నా శ్రీనివాస్ లు అన్నారు.ఆదివారం కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
ఆదేశాల మేరకు మండలానికి చెందిన కళ్యాణ్ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను 30 మంది లబ్ధిదారులకు అందించారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వేపూరి సుధీర్, బృందావనపురం,చాకిరాల, వల్లాపురం ఎక్లాస్క ఖాన్ పేట, ఎక్లాస్ ఖాన్ పేట తండా సర్పంచులు కంభంపాటి సరిత, చిర్ర రమ్య నాగేందర్, కేశగాని సరిత లక్ష్మణ్, నరసింహారావు,
ధారావత్ వరలక్ష్మి వెంకటనారాయణ,నాయకులు పల్లా వెంకటరెడ్డి,పాతకోట్ల నాగేశ్వరరావు,కాసాని శివలింగం,బాణాల నాగరాజు,భారీ వెంకన్న,సైదా నాయక్,వీరబాబు అధికారులు,
ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.