- ఇరువర్గాల వాదనలు విన్న రాష్ట్ర ధర్మాసనం.
- తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : 2016లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసును కొట్టివేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. గోపన్‌పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 127లో భూమికి సంబంధించిన ఈ వివాదంపై ఎస్సీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ఎన్. పెద్దిరాజు గచ్చిబౌలి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, ఇతరులు సొసైటీ భూమిని ఆక్రమించి, జేసీబీతో నిర్మాణాలను కూల్చివేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడిని కులం పేరుతో దూషించారని ఆరోపించారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి మూడో నిందితుడిగా చేర్చారు. జస్టిస్ మౌసుమి భట్టాచార్య ఈ కేసును హైకోర్టు విచారించింది.ఇరువర్గాల వాదనలు విన్నహైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.ఈ కేసులో రేవంత్ రెడ్డి 2020లో హైకోర్టును ఆశ్రయించి..ఈ ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని, ఎలాంటి ఆధారాలు లేవని వాదించారు. విచారణ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎనిమిది మంది సాక్షులను విచారించగా.. వారిలో ఎవరూ రేవంత్ రెడ్డి ఘటనా స్థలంలో ఉన్నట్లు నిర్ధారించలేదు.