Take a fresh look at your lifestyle.

భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు

కోరుట్ల/కథలాపూర్, ముద్ర విలేకరి: నాగుల పంచమి సందర్భంగా కథలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కథలాపూర్ లో స్థానిక వెంకటేశ్వర ఆలయంతో పాటు వివిధ ఆలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఉదయం దర్శనానికి బారులు తీరారు. భక్తిశ్రద్ధలతో పుట్టలో  పాలు పోసి పంచదార, పళ్ళు నైవేద్యంగా సమర్పించి, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలను చల్లంగ చూడు చూడుతల్లి అంటూ  నాగులమ్మను వేడుకున్నారు. పంచమి వేడుకలతో మండలంలో పండుగ వాతావరణం నెలకొంది. నూతన దంపతులు నాగదేవత విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేసారు. కార్యక్రమంలో పురోహితులు, దేవస్థాన అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.