Take a fresh look at your lifestyle.

ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్లతోనే పనులు

  • అప్పుడు కేసీఆర్​ కేబినెట్​ ముందుకు కాళేశ్వరం ప్రాజెక్టు రానేలేదు. 
  • కాళేశ్వరం కోసం సబ్​ కమిటీ వేయనేలేదు.
  • నేనున్నానని చెప్పుతున్న కమిటీ పెండింగ్​ ప్రాజెక్టుల మీద సబ్​ కమిటీ.
  • వాస్తవాలకు దూరంగా ఈటల కామెంట్స్​. 
  • నేనే కాళేశ్వరం కమిషన్ ​కు రిపోర్ట్​ ఇస్తా.
  • కమిషన్ కు  ఈటల చెప్పినదంతా అవాస్తవం.
  • పూర్తి ఆధారాలతో నేను చర్చకు రెడీ.
  • ఈటెలపై తుమ్మల ఫైర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన  కాళేశ్వరం కమిషన్ ముందు వింత వింత సంగతులు బయటకొస్తున్నాయి.ఈ కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చిన మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్  మాటలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్ర స్థాయిలో  మండిపడ్డారు.కాళేశ్వరం కమిషన్‌కు హాజరైన ఈటెల అసత్యాల వాంగ్మూలం ఇచ్చారన్నారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఈటెల పొంతనలేని సమాధానం ఇచ్చారన్నారు. ఆయన చెప్పిన సబ్ కమిటీ కాళేశ్వరం కోసం వేసింది కాదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కాళేశ్వరంకు శాంక్షన్ ఇచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టుల కోసం వేసిన సబ్ కమిటీ అని తుమ్మల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.ప్రాణహిత,దేవాదుల,కాంతలపల్లి,తుపాకుల గూడెం పనుల కోసం సబ్ కమిటీ వేశారన్నారు.అప్పటి బీఆర్ఎస్ పాలనా సమయంలో జరిగిన విషయాలను ఆయన గుర్తు చేశారు.ఆ సబ్ కమిటీ కాళేశ్వరం బ్యారేజీలపై ఎలాంటి నివేదిక ఇవ్వలేదని కాళేశ్వరం నిర్మాణానికి సబ్ కమిటీ ఆమోదం తెలిపిందనడం అబద్ధమన్నారు.అసలు కాళేశ్వరం కేబినెట్ ఆమోదం పొందలేదని మంత్రి తుమ్మల తేల్చిచెప్పారు.’కాళేశ్వరం ఎప్పుడూ కేబినెట్ ముందుకు రాలేదన్నారు. పరిపాలన అనుమతులతోనే కాళేశ్వరం అమలులోకి వచ్చిందన్నారు.ఈటెల రాజేందర్ ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు.కాళేశ్వరం ముందు ఈటలకు అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఆయన ల పట్ల గౌరవం ఉంది.కానీ ఆయన ప్రకటన చూసిన తర్వాత కొంత బాదేసిందన్నారు. అందుకే తానే స్వయంగా కమిషన్‌కు సబ్ కమిటీ రిపోర్ట్‌ను ఇవ్వాలి అనుకుంటున్నానని అన్నారు.కమిషన్ వివాదంలోకి తనను ఎందుకు లాగాల్సి వచ్చిందో ఈటెలే చెప్పాలన్నారు.  తాను కూడ కాళేశ్వరం కోసం సబ్ కమిటీ రిపోర్ట్‌ పై సంతకం చేశారని ఈటెల ఇచ్చిన వాగ్మూలం బాధాకరమని తుమ్మల వ్యాఖ్యానించారకు. కాళేశ్వరం కేబినెట్ ఉమ్మడి నిర్ణయం అని చెప్పడం సరికాదన్నారు. హరీష్ రావు అబద్దాల హరీష్ రావుగా మారిపోయారని అని ఈటెల అన్నారు. కాళేశ్వరం కేబినెట్ ముందుకు వచ్చినట్లు రుజువు చూపించాలని  ఈటెలను డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.