Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్ దోపిడీకి విముక్తి -ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి

 

ముద్ర కాప్రా

రాష్ట్రంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దోపిడీ చేశారని పరమేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమం ముసుగులో బీఆర్ఎస్ నాయకులే దోచుకున్నారన్నారు. చిల్కానగర్ డివిజన్లో బిఆర్ఎస్ పార్టీకి చెందిన పరుగులు నాయకులు కార్యకర్తలు ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భముగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ
చిలుకానగర్ డివిజన్ లో మొన్నటి వరకు కార్పొరేటర్ గా చేసిన వ్యక్తి “బన్నాల పన్ను” పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడినట్టుగా పరమేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
హైకోర్టు కాలనీ సమీపంలో రూ.100 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారన్నారు. ఇదే కాదు ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నారు.

రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన నడుస్తుందని పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల అమలతో అన్ని పార్టీల దృష్టి కాంగ్రెస్ వైపు మళ్లీందన్నారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన
రమణ, చెర్ల బలరాం, కొండ్ర రాములు, మారేపాక సాయిలు, పోలాటి కిష్టయ్య, కూరెల్లి యాదగిరి, రాంనర్సయ్య, సిహెచ్ ఐలయ్య, మారేపాక నాగయ్య పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Leave A Reply

Your email address will not be published.