మల్యాల,ముద్ర,విలేకరి :ఆపదలో ఉన్న పేద ఆనారోగ్య భాదితులకు అపన్నహస్తం గా ఎల్ వో సి అందిస్తున్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శుక్రవారం మండలంలోని రాజారం గ్రామానికి చెందిన శివరాత్రి గంగరాజం భుజానికి సర్జరీ నిమిత్తం 2లక్షల ఎల్ఓసీ చెక్కును ఎమ్మెల్యే బాధితుడికి అందజేశారు.పేద అనార్యోగ బాధితుల చికిత్సలకు ముందస్తుగా ఎల్ఓసీ ద్వారా చెక్కులను అందించండం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బత్తిని మల్లేశ్వరి శ్రీనివాస్ గౌడ్, ముత్యం శంకర్ గౌడ్, శనిగరపు తిరుపతి, నక్క అనిల్, బండి రవి గౌడ్, మోతుకుల నర్సయ్య తదితరులు ఉన్నారు.