Take a fresh look at your lifestyle.

“పశువులను ఇంటి ఆవరణలో ఉంచాలి”

రామకృష్ణాపూర్,ముద్ర విలేకరి : 48 గంటల్లోపు పశువుల యజమానులు ఆవులు,గేదెలను తమ ఇంటి ఆవరణలో ఉంచాలని,లేనిచో గోశాలకు తరలిస్తామని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు,పట్టణ ఎస్సై జీ.రాజశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు సంయుక్తంగా మాట్లాడారు.పట్టణంలోని రహదారులపై ప్రయాణించే వాహన చోదకులు,పాదచారులకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తదుపరి మున్సిపాలిటీ తీసుకునే చర్యలకు పశువుల యజమానులు పూర్తి బాధ్యులు అవతారన్నారు.

Leave A Reply

Your email address will not be published.