Take a fresh look at your lifestyle.

కలెక్టరేట్ భవన ఆవరణలో రోడ్ల నిర్మాణం చేపట్టాలి కలెక్టర్ ప్రతీక్ జైన్

 

ముద్ర, నారాయణ పేట :

 

నూతన కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం సింగారం మలుపు దారి వద్ద నిర్మాణంలో ఉన్న నూతన కలెక్టరేట్ భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. భవనం ఆవరణ లో అంతర్గత రహదారుల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. ప్రధాన రహదారికి కలెక్టరేట్ భవన సముదాయం వరకు సమాంతరంగా రోడ్డు వేయాలన్నారు. అలాగే భవన సముదాయానికి సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను అక్కడి నుంచి తొలగించి కొద్ది దూరంలో ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. భవనం చుట్టూ నాలుగు వైపులా మొక్కలు పెట్టీ గ్రీనరీ ఏర్పాటు చేయాలని డీఆర్డీవో మొగులప్ప కు చెప్పారు.

కలెక్టరేట్ సముదాయంతో పాటు బయట రోడ్లు, ఇతర పనుల్లో వేగం పెంచాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. అంతకు ముందుగా సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ ఫిర్యాదుదారుల నుంచి వినతుల స్వీకరించారు. 37 ఫిర్యాదులు రాగ వెంటనే పరిశీలించి పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు

 

Leave A Reply

Your email address will not be published.