Take a fresh look at your lifestyle.

శారీరక వ్యాయామం తప్పని సరి : పీయేసీ చైర్మన్ అరికపూరి గాంధీ

 

ముద్ర, శేరిలింగంపల్లి :

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ కాలనీ లో మైత్రి వాకర్స్ క్లబ్ మరియు మైత్రి నగర్ ఫేస్- 2 రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె వాక్ థాన్ కార్యక్రమం డీసీ శ్రీమతి శశిరేఖ, తాజా మాజీ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించి, విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన చైర్మన్ ఆరెకపూడి గాంధీ.


ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఈ రోజు మైత్రి వాకర్స్ క్లబ్ మరియు మైత్రి నగర్ ఫేస్ 2 రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె వాక్ థాన్ నిర్వహించడం చాలా అభినందనియం అని, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక శ్రమ ఎంతో అవసరం అని గుర్తు చేయడం ఈ వాక్ థాన్ ఎంతగానో తోడ్పడుతుంది అని ఎంతో మందికి స్ఫూర్తి గా నిలుస్తుంది అని , వృద్ధులు ,యువత , చిన్న పిల్లలు పాల్గొనడం ఎంతో ఆనందయాకం అన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహించాలని, శారీరక శ్రమ వలన మానసిక ఉల్లాసం ,ప్రశాంతత చేకూరుతుంది అని, మారిన జీవన శైలి లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాయమం చేయాలని, ఈ రన్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అని ,ఇది ఒక మంచి శుభపరిణామం చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ 5కె వాక్‌థాన్ మైథ్రినగర్ కమాన్ నుండి ప్రారంభమై తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ వరకు వెళ్లి తిరిగి మైథ్రినగర్ పార్క్ వద్ద ముగిసింది. చిన్నారులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని మరింత సందడిగా మార్చారు. వాక్‌థాన్ అనంతరం పిల్లల కోసం పలు వినోదాత్మక ఆటలు నిర్వహించడం జరిగింది. 5కె వాక్‌థాన్ కార్యక్రమం సమిష్టి కృషితో విజయవంతమై, ఆరోగ్య చైతన్యం మరియు సామాజిక ఐక్యతకు ఒక మంచి ఉదాహరణగా నిలిచిందni చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో మైథ్రినగర్ కాలనీ ఫేజ్–II సలహాదారులు చెన్నా రెడ్డి, సుబ్రహ్మణ్యం, కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సురేంద్ర మరియు ఇతర అసోసియేషన్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మైథ్రి వాకర్స్ క్లబ్ సభ్యులు సమన్వయం చేసి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.