Take a fresh look at your lifestyle.

నాగర్‌కర్నూల్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ అయ్యప్ప స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ

 

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:

పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ అయ్యప్ప స్వామి జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తుల భజనలు, కీర్తనల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఈ వేడుకలను ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుందర్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించగా, ఆలయ ప్రధాన పూజారి గవ్వమఠం విజయ శాస్త్రి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో పడిపూజోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా గురుస్వాములు సుందర్, తీగల శేఖర్, జగన్ పవిత్ర పడిని వెలిగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలను భక్తి భావంతో తిలకించారు.

కార్యక్రమంలో అనిల్, మురళి, శేఖర్, ప్రవీణ్, యాదగిరి, సురేష్ గురుస్వాములు పాల్గొన్నారు. అనంతరం ప్రధాన పూజారి భక్తులకు ఆశీర్వచనాలు అందించగా, తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.