Take a fresh look at your lifestyle.

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సలేశ్వరం జాతరకు సర్వసన్నాహాలు పూర్తి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో తెలంగాణ అమర్నాథ్‌గా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం జాతర ఘనంగా ప్రారంభానికి సిద్ధమైంది. పౌర్ణమి సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ జాతరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా మిషన్ భగీరథ ఆధ్వర్యంలో ఉచిత తాగునీటి సరఫరా కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు.

జాతర ప్రాంతమంతా చెక్‌పోస్టుల వద్ద తాగునీటి ట్యాంకులను ఏర్పాటు చేయడంతో పాటు ట్యాంకర్ల ద్వారా నిరంతర నీటి సరఫరా కొనసాగిస్తున్నారు. జాతర ముగిసే వరకు నీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీఈ హేమలత తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సీఈ లలిత, ఏఈలు మధు, సాయి, అక్బర్, సందీప్, హరినాథ్‌తో పాటు సిబ్బంది రాజేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.