ముద్ర, గద్వాల:
మల్దకల్ మండల పరిధిలో తాటికుంట గ్రామంలో మిషన్‌భగీరథ నల్లాకు ట్యాప్ పెట్టకుండానే అధికారులు వదిలేయడంతో నల్లా నుంచి నీరు వృథాగా పోతుంది. ఉదయం, రాత్రి తేడా లేకుండా తాగునీరు నేల పాలవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీరు మురుగు కాలువల గుండా ప్రవహించి పొలాల్లో చేరి నిండుతున్నాయని చెబుతున్నారు. సంబంధిత అధికారులకు విషయం తెలిసినా అటు వైపుగా కన్నెత్తి చూడడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నల్లా కనెక్షన్లకు ఆన్‌ఆఫ్‌లను వెంటనే అమర్చి నీటి వృథాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.