ముద్ర ప్రతినిధి, భువనగిరి:
భువనగిరి పట్టణంలో గురువారం వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన మూడేళ్ల బాలుడు ప్రియాన్ష్ ను భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి శనివారం పరామర్శించారు. హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని, కుటుంబ సభ్యులను కలిసి ఆయన ధైర్యం చెప్పారు.
ఇలాంటి ఘటనలు పునరా వృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు ఇట్టబోయిన గోపాల్, కౌన్సిలర్ నగేష్, వార్డు నాయకులు ఆనంద్ ఉన్నారు.