- ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అందుకు అనుగుణంగా వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటును అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.గురువారం క్యాంపు కార్యాలయ ఆవరణలో కల్వకుర్తి , వెల్దండ, చారకొండ మండలాలకు చెందిన రైతులకు 50 విద్యుత్ నియంత్రికలు పంపిణీ చేసి మాట్లాడారు. నిరంతర, నాణ్యమైన విద్యుత్ అందించడం జరుగుతుందని ఎక్కడ ఎలాంటి సమస్యలు వచ్చినా తక్షణమే మరమ్మతులు చేయాలని అధికారులు ఆదేశించారు.నియోజకవర్గం లో లో వోల్టేజ్ సమస్య లేకుండా నూతనంగా సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో విద్యుత్ నియంత్రికలతో పాటు సాగుకు అవసరమైన డ్రిప్పు, స్ప్రింక్లర్స్ రాయితీపై అందించడం జరుగుతుందని తెలిపారు.వ్యవసాయ యాంత్రికంలో భాగంగా సబ్సిడీపై యంత్ర పనిముట్లు అందించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డ్ సభ్యుడు బాలాజీ సింగ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి కల్వకుర్తి మాజీ సర్పంచ్లు ఆనంద్ కుమార్, సుదర్శన్ రెడ్డి, నాయకులు అశోక్ రెడ్డి, సంజీవ్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, రాములు, వివిధ మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు