Take a fresh look at your lifestyle.

జనగణన కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి

ముద్ర, తాండూర్ ప్రతినిధి :
తాండూర్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం జన గణన -2027 ను తాండూర్ మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మ్యాపింగ్, నెంబరింగ్ చేసే విధానాన్ని ఎన్యూ మారేటర్ ని అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ అభివృద్ధి కోసం జనాభా గణన లో భాగంగా ఇండ్ల వివరాలు, సౌకర్యాలకు సంబంధించి పకడ్బందీగా చేపట్టాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మేనేజర్ నరేందర్ రెడ్డి, సూపర్వైజర్ అనిల్ కుమార్, వార్డ్ కౌన్సిలర్, బిల్ కలెక్టర్, వార్డ్ ఆఫీసర్లు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.