Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

కోరుట్ల/కథలాపూర్, ముద్ర విలేకరి: బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం రోజు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, నోట్ బుక్కులను మండల విద్యాధికారి, లోకిని శ్రీనివాస్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు అందరూ ప్రభుత్వం అందించే అన్ని రకాల సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ, ప్రతిరోజు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని, ఉపాధ్యాయులు చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటూ అర్థం చేసుకోని, చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు వనతడుపుల రవికుమార్, చంద్రశేఖర్ రావు, అనిత శ్రీనివాస్, విజయ, అశోక్, కవిత, సలావుద్దీన్, సిఆర్పి విజయ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.