Take a fresh look at your lifestyle.

ముస్లిం సమాజాన్ని తప్పు తోవా పట్టిస్తే సహించేది లేదు…

 

* తంజీమ్ 414 /2010 రిజిస్ట్రేషన్ రద్దు అయిపొయింది
* 284/2023 రిజిస్ట్రేషన్ అమలులోకి వచ్చింది
* కోర్టు ఆదేశాల ప్రకారం ఫయాజ్, మహమూద్ లకు కిరాయి వసూలు చేసే అధికారం లేదు
* కిరాయి దారులు హజ్ హౌస్ తంజీమ్ లో కిరాయి జమ చేయాలి
తంజీమ్ సుప్రీం బాడీ సభ్యులు

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :

సిద్దిపేట ముస్లిం సమాజాన్ని ఎవరైనా తప్పు దారి పట్టిస్తే సహించేది లేదని సిద్దిపేట తంజీమ్ సుప్రీం బాడీ ప్రధాని కార్యదర్శి అబ్దుల్ ఖాదర్ హేచ్చరించారు. సోమవారం సిద్దిపేట తంజీమ్ హజ్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడుతూ తంజీమ్ 414/ 2010 రిజిస్ట్రేషన్ రద్దు అయిపోయిందని దానికి బదులు 284/2023 రిజిస్ట్రేషన్ అమలులోకి ఉంటుందన్నారు. సిద్దిపేట ప్రజలు కొంతమంది చేప్తున్నట్టుగా వారి మాటలను పరిగణలోకి తీసుకోవద్దన్నారు. తంజీమ్ షాపింగ్ కాంప్లెక్స్ లలో కిరాయికి ఉన్న వారు తమ కిరాయి ను సిద్దిపేట తంజీమ్ కమిటీ హజ్ హౌస్ లో చెల్లించాలన్నారు. ఫయాజ్, మహమూద్ అలాగే వారితో ఉన్నవారు ఎవరు కూడా కిరాయి వసూలు చేయడానికి వీళ్లేదని సిద్దిపేట కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్న విషయాన్నీ కిరాయి దారులు గమనించలని సూచించారు. వారికి ఎవరు కిరాయి ఇచ్చిన ఇచ్చిన వారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
తమపై ఆరోపనులు చేస్తున్న వారి వద్ద కమిటీ కి చెందిన ఎలాంటి డాక్యూమెంట్స్ కాని, బ్యాంకు అకౌంట్స్ కాని లేవని వారు తంజీమ్ గురించి మాట్లాడడం అవివేక చర్య అన్నారు. కొంతమంది యువతను వెనుక వేసుకొని వారిని తప్పుతోవ పట్టిస్తు వారి జీవితాలను నాశనం చేయొద్దని హితవు పలికారు. ముస్లిం మత పెద్దలు 1950 లో స్థాపించిన తంజీమ్ను కొంతమంది తమ స్వార్ధం కోసం అభాసూ పాలు చేస్తున్నారన్నారు…ఇలాంటి చర్యలను సహించేది లేదని హేచ్చరించారు. సమావేశం లో సిద్దిపేట తంజీమ్ కమిటీ అధ్యక్షుడు జియావుద్దీన్ అసిఫ్, సుప్రీం బాడీ సభ్యులు పాల్గొన్నారూ

Leave A Reply

Your email address will not be published.