ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భువనగిరి పట్టణంలోని జలీల్ పుర మజీద్ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర మక్కా యాత్రకు వెళుతున్న యాత్రికులను బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మజీద్ కమిటీ అధ్యక్షుడు ఇక్బాల్ చౌదరి మాట్లాడుతూ మక్కా యాత్రకు వెళుతున్న యాత్రికులకు వారు చేసే ప్రార్థనలో ఎలాంటి పొరపాటలు అవకతవకలు జరగకుండా ఉండటానికి వారికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ సభ్యులు ముస్తాఫ్ చౌదరి, అత ఉర్ రహమాన్ షకీల్ ముస్తఫా ఖాదిరి కాజమ్ అహ్మద్, షేక్ మీరా చౌదరి, సాధాక్ అలీ, ఇక్బాల్ అహ్మద్, రహీం ఉద్దీన్, మోహి ఉద్దీన్, అదిల్, సుజావుద్దీన్, ఇషాక్ పాల్గొన్నారు.