సంగారెడ్డి ముద్ర,ఫిబ్రవరి23:
తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ లోని తన నివాసంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ రేడియోగ్రాఫర్స్ అండ్ టెక్నాలజిస్ట్ తెలంగాణ స్టేట్ చాప్టర్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్, నేషనల్ కాన్ఫరెన్స్ కోసం రూపొందించిన పోస్టర్ లను సోమవారం రోజు ఆవిష్కరించారు.ఈసందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ .రోగ నిర్దారణ లో రేడియోగ్రాఫర్స్ పాత్ర ఎంతో కీలకమన్నారు.రేడియో గ్రాఫర్స్ & టెక్నీషియన్ ల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామన్నారు.వైద్య రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిఙ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రేడియో గ్రాఫర్స్ కు సూచించారు .

ఈకార్యక్రమంలో తెలంగాణ చాప్టర్ అధ్యక్షులు ఎంఏ. హన్సారీ,జనరల్ సెక్రటరీ జి. గంగాధర్ ,ఫైనాన్స్ సెక్రటరీ బండి లింగరాజు,సొసైటీ కార్యవర్గ సభ్యులు టోనీ అంటోనీ,రహిమా,మానస, మోత్కూరు శ్రీనివాస్,రాజేంద్ర ప్రసాద్ బి.సురేష్, విద్యాసాగర్,గణేష్,ప్రకాష్ సాయిచందు,నాగరాజు, అర్జున్,భావన, నాగార్జున,శ్రీనివాస్ నాయక్ ఏం. రాజేష్,కిరణ్ నాయక్, ప్రభాకర్ గౌడ్ తరితరులు పాల్గొన్నారు.