మోత్కూర్ ముద్ర న్యూస్ :
స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో చైర్ పర్సన్ గడ్డం స్వప్న అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ మొదటి సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశానికి ఎమ్మెల్యే మందుల సామెల్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కౌన్సిల్ లో ప్రవేశపెట్టిన ఎజెండా అంశములను చర్చించి ఆమోదించారు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు మురికి కాలువల నిర్మాణం, వీధి దీపాలు వివిధ అభివృద్ధి పనుల కోసం కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని తెలిపారు. పెద్ద చెరువులో కలుస్తున్నటువంటి మురుగు నీటిని శుద్ధి చేయుటకు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను ఏర్పాటు చేయుటకు కృషి చేస్తానని తెలిపారు. బునాదిగాని కాలువ పనులను అతి త్వరగా పూర్తి చేసి సాగు నీటిని పరిసర ప్రాంత రైతులకి పంటల సాగు కోసం అందించడానికి కృషి చేస్తానని తెలిపారు. పట్టణ ప్రజలు అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించినందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కౌన్సిల్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ , వైస్ చైర్మన్ వార్డు సభ్యులు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పట్టణంలో జరిగే అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందించి మోత్కూరు మున్సిపాలిటీని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుపుతామని అన్నారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ కమిషనర్ కె సతీష్ కుమార్, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, వార్డు కౌన్సిలర్లు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
మోత్కూర్ మున్సిపాలిటీ నీ ఆదర్శంగా తీర్చిదిద్దుతా.

మోత్కూర్ మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. సోమవారం నూతన చైర్మన్ వైస్ చైర్మన్ వార్డు సభ్యుల పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ మోత్కూర్ మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని గతంలో ఇక్కడ 15 కోట్ల రూపాయలతో మెయిన్ రోడ్డు వేయించడం జరిగిందని మరిన్ని నిధులు తీసుకువచ్చి మోత్కూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. త్వరలో బృందావన్ కాలువను సుందరీ కరణ చేసి మురికి నీరు పెద్ద చెరువులో చేరకుండా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీధి దీపాలు తాగునీటి సమస్య లు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. నూతన మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నరసయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే మందుల సామెల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ల సహాయంతో మోత్కూర్ లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అల్లర్ల వెంకన్న, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.