- హుండీలో డబ్బులు లెక్కిస్తున్న ఈవో వసంత, చైర్మన్ చంటిబాబు.
మెహిదీపట్నం ముద్ర విలేఖరి : గోల్కొండ జగదాంబికా మహంకాళి ఆలయ హుండీ లెక్కింపు మంగళవారం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో వసంత సమక్షంలో ఆలయ కమిటీ చైర్మన్ కొండేపూడి చంటిబాబు హుండీ లెక్కింపు నిర్వహించారు. గోల్కొండ జగదాంబికా బోనాలు గత గురువారం ప్రారంభమవ్వగా ఆదివారం రెండోవ పూజ నిర్వహించారు. ఈ వారం రోజుల్లో భక్తుల నుండి అమ్మవారి హుండీ ఆదాయం 3,29,262 రూపాయలు వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.