Take a fresh look at your lifestyle.

యాదగిరిగుట్టలో హోలీకోత్సవం

ముద్ర, భువనగిరి ప్రతినిధి :
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో మంగళవారం వసంతోత్సవం(హోలీకోత్సవం) సందర్భముగా చంద్ర గ్రహణము కారణమున ముందు రోజైన సోమవారం హోలీ కార్యక్రమం నిర్వహించారు. హోలీ పండుగ సందర్భంగా ఉత్సవమూర్తులను వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉత్సవంలో ఆలయ ప్రధానార్చకులు కాండురి వేంకట చార్యులు. పాల్గొని వసంతోత్సవ వేడుక విశిష్టతను భక్తులకు వివరించారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ వేడుకలు జరుపుకున్నారు.
అనంతరం ఆలయ అధికారులు కె సీతారామ చారి పర్యవేక్షకులు , అర్చకులు , సిబ్బంది సమక్షంలో కామదహణము కార్యక్రమము నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.