–పార్టీ మీటింగులో పాల్గొంటే పబ్లిక్ మీటింగ్ అంత హడావిడి
-పార్టీ మీటింగ్ పెట్టుకోవడానికి అంత భయమా..?
-పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి వై గీత
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ జిల్లాలో లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ పర్యటన సందర్బంగా అరెస్టులు కొనసాగాయి. జిల్లా అధ్యక్షులు మహేందర్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు తేజ ఎం ఆర్ ఎస్ పి ఎస్ జిల్లా యకురాలు, పుష్ప రాణి, సునిత లను ఉదయం 6 గంటల నుండి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అరెస్టు అయిన నాయకులు మాట్లాడుతూ దేశంలో బిజెపి విధానాలతో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, బహుళ భాషలు, సంస్కృతులు, మతాలు ఉన్న దేశంలో అందరి గొంతు వినిపించే అవకాశం కావాలని రాజ్యాంగాన్ని రక్షించాలని
దేశంలో ప్రజాస్వామ్య రక్షణ, రైతు, కార్మిక నల్ల చట్టాలు, కార్పొరేట్ వ్యవసాయం, ఉద్యోగ అవకాశాలు, డేటా భద్రత, అమెరికాతో ట్రేడ్ డీల్ విషయాలపై మాట్లాడుతున్నారు.
అదే విషయాల మీద నిరంతరం పోరాడే కమ్యూనిస్టులను రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా అరెస్ట్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కోసం ప్రభుత్వం భూములను అడవులను అప్పజెప్తూ జరిపే బుల్డోజర్ పాలనపై రాహుల్ గాంధీ పోరాడతారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరుగుతుందని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలు భయంతో బ్రతుకుతున్నారన్నారు. ఏ రాత్రి వాళ్ళ నివాసాలు ఏ కూల్చి వేతలకు గురవుతాయో ఏ క్షేణంలో వాళ్ళ ఇండ్ల మీదికి బుల్డోజర్ లు వస్తాయో అని ఆందోళన చెందుతున్నారన్నారు.
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల నివాసాలు కూల్చారని, పచ్చని అడవులు నరకివేయడం, అభివృద్ధి పేరుతో పేదల భూములు, ప్రభుత్వం భూములను లాక్కుంటున్నారని, దళితుల మీద ఆదివాసీలు, మహిళల మీద దౌర్జన్యాలు ఎక్కువయ్యాయన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అటవీ విధ్వంశాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డెవలప్మెంట్ పేర్లతో పేదల ఇండ్లను మాత్రమే ఎందుకు కూలుస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు.
కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్మిక వర్గానికి నష్టం చేకూర్చే 4 లేబర్ కోడ్ లు వ్యతిరేస్తూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదో చెప్పాలన్నారు.
ప్రాజెక్టుల పేరుతో పేదల భూములను, ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు ఎందుకు అప్పచెబుతున్నారు సమాధానం ఇవ్వాలని,
తెలంగాణ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని బాధితులకు న్యాయం చేయాలన్నారు.