పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు నడుంబించాలని పర్యావరణ పరిరక్షణతోనే సమస్త ప్రాని కోటి మనుగడ సాగుతుందని శ్రీ చైతన్య విద్యాసంస్థల దిల్సుఖ్నగర్ జోన్ ఏటీఎం శ్రీ సతీష్ గారు తెలిపారు గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి మరియు పచ్చదనాన్ని పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి శ్రీ చైతన్య విద్యాసంస్థలు స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం లో భాగంగా గ్రీన్ ఇండియా మిషన్ నిర్వహించడం జరిగింది. పచ్చదనం పరిశుభ్రత భాగంగా ఆదిభట్ల శ్రీ చైతన్య పాఠశాల ఆవరణలో ప్రిన్సిపల్స్ సతీష్ గారు హుస్సేన్ గార్ల ఆధ్వర్యంలో స్కూల్ సిబ్బంది మరియు పాఠశాల విద్యార్థులు మొక్కలు నాటి నీరు పోయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఏ జీ ఎం సతీష్ విద్యార్థులను ఉద్దేశించి పర్యావరణం పై జరుగుతున్న ప్రయోగాల జీవకోటి మనుగడకు ముప్పు వాటిల్లేందుకు మానవులే కారణమవుతున్నారని విచక్షణారహితంగా చెట్లను నరికి వేయడం వలన మానవ వినాశనం అవుతుంది కావున ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టును తమ పుట్టినరోజు సందర్భంగా రెండు చెట్లను నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని మానవాళి భవిష్యత్తుకు వెలుగుల నింపి రేపటి భావితరాలకు కాలుష్య రహిత వాతావరణం అందించాలని ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ ఐ లు వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డిగారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మల్లం వెంకటేశం గౌడ్ డీన్లు, ఇన్చార్జెస్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు