ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి : కల్వకుర్తి బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా జే నరేందర్ రెడ్డి విజయం సాధించారు. శుక్రవారం ఎన్నికలు జరిగిన జాయింట్ సెక్రెటరీ పదవికి బి మల్లేష్ యాదవ్ ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న వారు, వైస్ ప్రెసిడెంట్ గా ఎస్ జయం తు కుమార్ జనరల్ సెక్రెటరీగా ఎస్ మల్లేష్, ట్రెజరర్ గా కే అంజనేయులు, లైబ్రరీనిగా బి ప్రశాంత్, ప్రెస్ సెక్రటరీగా ఏ రాంగోపాల్ ఎన్నికైనారు.ఈ సందర్భంగా ఎన్నికైన నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ అందరి సహకారంతో కల్వకుర్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన భవన కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని, న్యాయవాదుల సమస్యలకు పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు.కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు కే వెంకట రమణ ,సీనియర్ న్యాయవాదులు జి వెంకట్ గౌడ్ ,లక్ష్మీనారాయణ,భాస్కర్ రెడ్డి, సి. కృష్ణయ్య, ఎజీపీలు వెంకట్ రెడ్డి, లక్ష్మణ్ రాజ్ వెంకటేష్, నాగరాజు, శ్రీకాంత్, శేఖర్, నరేష్, జంగయ్య, శ్రీను తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.