గండిపేట్, ముద్ర విలేకరి : నార్సింగి మున్సిపాలిటి కమిషనర్ వ్యవహార శైలీ సమంజసంగా లేదని, మున్సిపల్ కమిషనర్ పై జిల్లా కలెక్టర్‌ను కలిసి వివరిస్తానని 17 వ వార్డు మాజీ కౌన్సిలర్ ఉషారాణి అన్నారు.ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ..నేనే రాజును నేనే మంత్రిని అనే చందంగా మున్సిపల్ కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.గత కొద్ది సంవత్సరాలుగా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ నాలుగున్నర సంవత్సరాలు ఒక మహిళను ఆఫీసుల చుట్టూ తిరిగి బ్యాలెట్ బాక్స్ లను ఖాళీ చేయించాడం జరిగిందని గుర్తు చేశారు.ఈ విషయంపై ఎవ్వరు పట్టించుకోలేదని, చూసి చూడనట్టు వ్యవహరించారన్నారు.17వ వార్డులో కమిటీ హాల్ లేకపోవడంతో పాత గ్రామపంచాయతీ ఆఫీస్ ను కమిటీ హల్ కట్టడానికి కౌన్సిల్ మీటింగ్లో తీర్మానం చేసి పెట్టడం జరిగిందన్నారు.కృష్ణమోహన్ రెడ్డి కమిషనర్ గా వచ్చిన తర్వాత కమిటీ హాల్ పనులు ఆపడం జరిగిందన్నారు.చాలాసార్లు కమిషనర్ ను బిల్డింగ్ నిర్మాణం గురించి కలిశామని వివరించారు.17వ వార్డులో పెండింగ్ బిల్లులు స్వయంగా ఫోన్లు చేసి నాలుగు ఐదు రోజుల్లో 90% ఇంటి పన్నులు కట్టించినట్లు తెలిపారు. అయినా కూడా స్పందన లేదన్నారు.నార్సింగి రిజిస్ట్రేషన్ ఆఫీస్ డబ్బులు రూ.285 కోట్లు వచ్చిన నార్సింగి మున్సిపాలిటీ హౌస్ టాక్స్ లు కోట్లల్లో వసూలైన కమిటీ హాల్ విషయంలో కమిషనర్ డబ్బులు లేవని చెప్పడం జరిగిందని గుర్తు చేశారు.వట్టినాగులపల్లి మొదలు నార్సింగ్ మున్సిపాలిటీలో ఎన్నో ప్రైవేటు బిల్డింగులు అక్రమంగా కడుతున్నారన్నారు.లక్షలలో డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. ప్రజలకు ఉపయోగపడే కమిటీ హాల్ పనులు ఆపడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.ఎవరితోనైనా ఫోన్ చేయిస్తే, వీడెంత, వాడెంత అని నాకు పొలిటికల్ లీడర్స్ అంటే నచ్చరంటూ ఆరోపించారు.నార్సింగి మున్సిపాలిటీ మొత్తం నాదే అని ఏక చక్రాధిపత్యంగా వ్యవహరిస్తున్నాడన్నారు. తనను ఎవరు ఏం చేయలేరు, తనకు అందరూ మినిస్టర్లు తెలుసు, మీరంతా నా ముందు ఎంత అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడన్నారు. తాము అధికార పార్టీలో ఉండి కూడా అహర్నిశలు కష్టపడి ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల్లో తీసుకెళ్తూ గత కొద్ది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నామన్నారు.అయినా ప్రజలకు ఉపయోగపడే బిల్డింగ్ పైన ఇంత పక్షపాతమా ఎవరైనా అడిగితే మీ వాళ్లే వద్దంటున్నారని సమాధానం చెప్పి తప్పించుకుంటున్నారన్నారు.ఎమ్మెల్యే చెప్పినా వినకపోవడం బాధకరమన్నారు.సొంత ప్రాపర్టీ కాదని ప్రజలకు ఉపయోగపడే ప్రాపర్టీ త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ఈ విషయంపై కలెక్టర్ కు ప్రభుత్వ అధికారులకు, మంత్రులకు ఫిర్యాదు చేస్తామని వివరించారు.