Take a fresh look at your lifestyle.

మలేషియాలో ఏడాదిగా హబ్సిపూర్ వ్యక్తి ఆచూకీ గల్లంతు

  • సహాయం చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిసిన కుటుంబ సభ్యులు.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం హబ్సిపూర్ గ్రామనికి చెందిన కారం నరసయ్య బ్రతుకు దెరువు కోసం 20 సంవత్సరాలుగా మలేషియా వెళ్ళి ఉపాధి పొందుతున్నాడు.కారం నర్సయ్య గత సంవత్సర కాలం నుండి కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడం లేదు.మలేషియాలో పని చేసిన ఒక వ్యక్తి ద్వారా నర్సయ్య మరణించినట్లు సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.ఈ విషయమై మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డిని కలిసి సమాచారం అందించి నర్సయ్య ఆచూకీ తెలుసుకునే విదంగా సహాయం చేయాలని కుటుంబ సభ్యులు భార్య, కుమార్తె రోదిస్తూ వేడుకున్నారు.స్పందించిన జీవన్ రెడ్డి మలేషియా లోని సర్వీస్ నెంబర్ కి ఫోన్ చేసి నర్సయ్య ఆచూకీ తెలుసుకొనే ప్రయత్నం చేశారు.పాస్పోర్ట్, ఆధార్ ఎలాంటి ఆధారాలు లబించక పోవడంతో తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ బోర్డు మెంబెర్ మంద భీమ్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు సేకరించాలని తెలిపారు.త్వరలోనే ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తానని కుటుంబ సభ్యులకు జీవన్ రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.