ముద్ర ప్రతినిధి,గోదావరిఖని: భద్రత ఆడిట్ తనిఖీ బృందం సభ్యులతో తనిఖీ కోసం గురువారం ఆర్ ర్జీ 1 ఏరియా జీడీకే ఓసి 5 ని సందర్శించారు.ముందుగా జీడీకే ఓసి 5 సంబంధించి మ్యాప్ లను పరిశీలించారు.తదనంతరం వ్యూ పాయింట్ వద్దకు వెళ్లి భద్రత కు సంబంధించి చేపట్టిన రక్షణ చర్యలను పరిశీలించారు.కోల్ బెంచెస్,ఫైర్ ఫైటింగ్,వెహికిల్ రవాణా రోడ్లు పరిశీలించారు. ప్రమాదాలు లేకుండా బొగ్గు ఉత్పత్తి చేసేల చర్యలుచేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భద్రతా ఆడిట్ తనిఖీ బృందం సభ్యులు మధుసూధన్ ఎజిఏం ప్రాజెక్ట్ ఆఫీసర్,రాజాజీ డి.జిఎం
(ఈ అండ్ ఏం),రావుల పాపయ్య అడిషనల్ మేనేజర్ జాన్ జయంత్ బాబు,ఈ ఈ.(ఈ అండ్ ఏం) ఓసి.3 నుండి వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్ మదన్ మోహన్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ సాయి ప్రసాద్,ఓసి 5 ప్రాజెక్టు అధికారి చంద్రశేఖర్,పిట్ ఇంజనీర్ రమేష్, సేఫ్టీ ఆఫీసర్ పొనుగోటి శ్రీనివాస్, ఎ.రవి అడిషనల్ మేనేజర్,సర్వే ఆఫీసర్ అశోక్,మహేష్ వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ మల్లం తిరుపతి, సమ్మయ్య ఉన్నారు.