* స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ
* కాలువలో నీటి ప్రవాహకానికి ఆటంకంగా ఉన్న వ్యర్ధాలను వెంటనే తొలగించాలి
* నైట్ షెల్టర్ లో సీసీ కెమెరా ను వెంటనే ఏర్పాటు చేయాలి
* రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసిన అదనపు కలెక్టర్
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రామగుండం నగర కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తెలిపారు. గురువారం రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ డివిజన్లలో పర్యటించి అక్కడి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. 23వ డివిజన్ భీమునిపట్నం కాలువల్లో ఉన్న వ్యర్ధాలను యంత్రాలతో శుభ్రం చేయించాలని అదనపు కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. టీచర్స్ కాలనీ పార్క్, కాలనీలోని గుంతల్లో మురుగు నీటి వ్యర్ధాలను వెంటనే తొలగించాలని అన్నారు.బస్ స్టాండ్ ఆవరణలోని నైట్ షెల్టర్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా ఉండాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ వెంట డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు