- తులం పావు బంగారం, 2 కార్లు, 2 మోటార్ సైకిల్, 8 స్మార్ట్ ఫోన్ సిజ్.
- మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో దోపిడీకి పాల్పడిన దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పోలిస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పి వివరాలు వెల్లడించారు. కల్లెడకు చెందిన ఇందూరి శంకరయ్య జూలై 22 మంగళవారం మధ్యాహ్నం కల్లెడ నుండి జగిత్యాలకు వస్తుండగా తరాల శ్రీకాంత్ @ బండి శ్రీకాంత్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగి తెలుసుకుని జగిత్యాల పట్టణంలోని హనుమాన్ వాడ బీరయ్య గుడి వద్దకు రాగానే అక్కడ బండి శ్రీకాంత్, పాలకుర్తి రాజు, చెట్ల మల్లేశంలు ఇందూరి శంకరయ్యను పాలకుర్తి రాజు ఇంటిలోకి తీసుకెళ్లి కొట్టి బెదిరించి అతని వద్ద ఉన్న తులంపావు బంగారం దోపిడీ చేసి, బండి శ్రీకాంత్ ఒక లక్ష రూపాయలు ఫోన్ ద్వారా ఫోన్ పే చేయించుకున్నాడు. తర్వాత బండి శ్రీకాంత్, చెట్ల మల్లేశం, మరో ఇద్దరు వ్యక్తులు ఉల్లెంగుల సతీష్, బడుసు మురళి లు కలిసి టిఎస్ 02 క్యు 3666 నెంబర్ కారులో బలవంతంగా సారంగాపూర్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి కొట్టి, కత్తితో బెదిరించి ఇంకా డబ్బులు కావాలని ఇవ్వకుంటే చంపుతామని బెదిరించారు. తరువాత బండి శ్రీకాంత్ ఏలేటి మోహన్ రెడ్డిని పిలిచి డబ్బులు పంచుకుందామని ఏలేటి మోహన్ రెడ్డి, అన్నారపు రఘు, బండి మధులను పిలిపించి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కల్లెడకు వచ్చి ఇంకా డబ్బు బంగారం కావాలని బెదిరించారు. ఇందూరి శంకరయ్యన వాళ్ళ అమ్మ మీద ఉన్న పుస్తెలతాడు తీసుకుని వాళ్లకు ఇవ్వబోతే పుస్తెలతాడును వారు తీసుకోక అది అమ్మి డబ్బులు తేవాలని బెదిరించారు. దీంతో జగిత్యాలకు వారి బైక్ పై కూర్చోబెట్టుకుని వచ్చి, టవర్ దగ్గర గల బాలాజీ జువేల్లర్స్ లో అమ్మి డబ్బులు తీసుకుంటుండగా ఇందూరి శంకరయ్య బావ తుమ్మనపల్లి రమేష్ వచ్చి ఆపీ ఈ విషయం తెలుసుకుని తుమ్మనపల్లి రమేష్, శంకరయ్యలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి జగిత్యాల పట్టణ ఇన్స్పెక్టర్ పి.కరుణాకర్ ఫిర్యాదు చేయగా, సిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి 24 గంటల లోపు బుధవారం 8 మంది నిందితులు తరాల శ్రీకాంత్ @ బండి శ్రీకాంత్ తండ్రి, చెట్ల మల్లేష్, పాలకుర్తి రాజు @డిబ్బిరి రాజు, బడుసు మురళి, ఉల్లెంగుల సతీష్, ఏలేటి మోహన్ రెడ్డి, అన్నారపు రఘు, బండి మధులు జగిత్యాల పట్టణంలో దోపిడీ చేసిన డబ్బులు పంచుకుందామని మాట్లాడుకుంటుండగా నిందితులను పట్టుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ దోపిడి దొంగల ముఠాను పట్టుకోవడంలో కృషి చేసిన డిఎస్పి రఘు చందర్, టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్.ఐ లు సధాకర్, కుమారస్వామి, సుప్రియ, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించి నగదు బహుమతిని అందజేశారు.
