Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ హనుమంత రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పురోగతి లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం మినీ మీటింగ్ హాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నిర్మాణం పనులను పూర్తి చేసిన వారి పై యం పి డి ఓ,యం పి ఓ లు, హోసింగ్ సిబ్బంది తో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయిన లబ్ధిదారులకు జాబ్ కార్డులు, ఉపాధి హామీ పధకం, వ్వక్తి గత మరుగుదొడ్లు నిర్మాణపు పనులపై మండలాల వారీగా , జిల్లా కలెక్టర్ హనుమంత రావు సమీక్షించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లడుతూ జిల్లా లో ప్రతి మండలం లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు జాబ్ కార్డు ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పధకం క్రింద 90 రోజులు పని దినాలకు ఎంత పే మెంట్ ఇవ్వడం జరిగిందని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసిన వారు వ్వక్తిగత మరుగుదొడ్లు పూర్తి చేసిన వారికీ 12 వేలు ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి,భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి,హౌసింగ్ పీడీ విజయసింగ్, శ్రీరాములు, ఎంపీడీవోలు, ఏ పి ఓ లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.