ముద్ర నడిగూడెం….
నడిగూడెం మండల వ్యాప్తంగా కెసిఆర్ 72వ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో గల సాయిబాబా మందిరంలో కెసిఆర్ జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలో నిర్వహించిన కెసిఆర్ జన్మదిన వేడుకలకు ముఖ్యఅతిథిగా కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ హాజరై కేక్ కట్ చేసి కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కెసిఆర్ జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ యాదవ మాట్లాడుతూస్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా 12 ఏళ్లు శాంతియుత మార్గంలో అలుపెరుగని పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు.సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టి ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి కరువు నేలను సిరుల తెలంగాణగా మార్చి దేశంలోనే తెలంగాణను ప్రథమ స్థాయిలో నిలిపారని పేర్కొన్నారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పల్ల నర్సిరెడ్డి, కరివిరాల సర్పంచ్ మారోజు పార్వతమ్మ, గ్రామ శాఖ అధ్యక్షులు బోనగిరి ఉపేందర్ కార్యదర్శి కాసాని సతీష్ యూత్ నాయకులు మేకల వీరబాబు వార్డు సభ్యులు దున్న మనీషా, పోలబోయిన విజయ కాసాని శైలజ, టిఆర్ఎస్ నాయకులు అనంతల ఆంజనేయులు దున్న సుధాకర్ నూనె నాగన్న అనంతల మహేష్ పోలంపల్లి వెంకన్న బెల్లం శ్రీనివాస్ వల్లెప్ శ్రీనివాస్ ఆర్ఎంపి సైదులు నక్క సైదులు ఎస్ కే జలీల్ కురాకుల కృష్ణమూర్తి మేకల గంగరాజు, కాసాని ఉపేందర్ దున్నా రవి ఆయా గ్రామాల వార్డు సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల నాయకులు ,పార్టీ కార్యకర్తలు మురళీకృష్ణ ఎస్ కే జానీ తంగెళ్ళ మహేష్ మండవ అనిల్ బడుగుల వెంకటేష్ అభిమానులు పాల్గొన్నారు