ముద్ర, శేరిలింగంపల్లి:
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే తో శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో మర్యాదపూర్వకంగా కలిసి సమీక్షా సమావేశం జరిపిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.
ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై జోనల్ కమిషనర్ తో చర్చించారు. పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని , అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని, పనులలో వేగం పెంచాలని సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడలని , అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని, రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.