పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుంది
తాండూరు పట్టణంలో 7,8 వార్డుల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు
బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం
తాండూరు. ఫిబ్రవరి 4 (ముద్ర న్యూస్): సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు నిరంతరం అండగా ఉంటుందని తాండూరు నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం తాండూర్ పట్టణంలోని 7 8 వార్డుల్లో ఆయన పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ వార్డులోని రాజు గృహకల్ప ఇందిరమ్మ కాలనీ, ఎన్టీఆర్ నగర్, హరిహర టౌన్ లలో మౌలిక వసతుల కల్పనకు చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆయా
కాలనీల్లో సమస్యలను పరిష్కరించేందుకు ఎన్నికల తర్వాత కృషి చేస్తానని తాండూరు నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. తాండూరు పట్టణంలోని 7,8 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు బాతుల నాగరాజు, కరాటే సాయప్ప తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డ్ నెంబర్ 7 ఎన్టీఆర్ నగర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కాలనీలో సిసి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం జరిగిందని తెలిపారు. మిగిలి ఉన్న సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, కౌన్సిలర్ అభ్యర్థి బాతుల నాగు కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే, కాలనీలో నెలకొని ఉన్న అనేక సమస్యలను పరిష్కరిస్తానని కాలనీవాసులకు ఆయన భరోసానిచ్చారు. . కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలోనే రాజీవ్ గృహకల్ప ,ఇందిరమ్మ కాలనీలో పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణానికి దూరంగా ఉన్న రాజీవ్ గృహకల్ప ఇందిరమ్మ కాలనీలోని ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు ఈ
వార్డును తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకొచ్చి,
పోలీస్ అవుట్ పోస్ట్ త్వరలోనే
ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.
కాలనీల లో మరింత
అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు.
కార్యక్రమంలో 7వ కౌన్సిలర్ అభ్యర్థి బాతుల నాగు,
8వ అభ్యర్థి తలారి సాయప్ప,
వార్డ్ ఇంచార్జ్ సీనియర్ నాయకులు లొంక నర్సింలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జుబేర్ లాల, బాతుల వెంకటయ్య, అబ్దుల్ రాహుఫ్, శివ కుమార్, వెంకన్న గౌడ్, తదితరులు పాల్గొన్నారు.