రామకృష్ణాపూర్,ముద్ర విలేకరి : వాహన చోదకులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పట్టణ ఎస్సై జీ.రాజశేఖర్ సూచించారు. గురువారం రాత్రి గద్దె రాగడి వద్ద వాహన తనిఖీలు చేపడుతున్న క్రమంలో రాంగ్ రూట్లో వస్తున్న వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో పట్టుపడిన వాహన చోదకులకు జరిమానా విధించి,కౌన్సిలింగ్ నిర్వహించారు.అనంతరం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.