ముద్ర, మోత్కూర్:
మోత్కూర్ మున్సిపాలిటీ 6వ వార్డ్ అరేగూడెం లో రోడ్డు విస్తరణ చేస్తానని మాట ఇచ్చి గెలవగానే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అభివృద్ధిలో తోడ్పడి సహకరిస్తే మోత్కూరు మున్సిపాలిటీ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దం నాగార్జున రెడ్డి, వార్డు ఆఫీసర్ శ్రవణ్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు