ముద్ర, యాదగిరిగుట్ట :
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అనుసంధానంగా రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అ లైవ్ క్యాంపెయిన్- 2026 లో భాగంగా యాదగిరిగుట్ట మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి అధికారులు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ చైర్మన్ కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరంయాదగిరిగుట్ట మున్సిపాలిటీ గ్రామాల పరిధిలో ఈనెల 13 నుండి 18 వరకు చేపట్టవలసిన కార్యక్రమాల గురించి అవగాహన సదస్సు నిర్వహించటం జరిగింది .సీసీ కెమెరాలు రోడ్ సేఫ్టీ విధానాల యొక్క ప్రాముఖ్యతను అట్టి ప్రమాణాలను అందరూ తూచా తప్పకుండ పాటించాలని, మండల పరిధిలోని ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు కలుగకుండా చూడాలని, సైబర్ క్రైమ్ డిజిటల్ అరెస్ట్ గురించి ప్రజలకు తెలియజేయాలని, గంజాయి డ్రగ్స్ నుంచి యువతను కాపాడాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ రాష్ డ్రైవింగ్ లను నివారించాలని, ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా పోలీసు వారిని 100 డయల్ చేసి సంప్రదించాలని, ప్రజలకు మేలు చేసే అన్ని విషయాల గురించి చర్చించి వాటిని అమలుపరిచే విధంగా కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ వైస్ చైర్మన్ బరిగే రమ్య రామచందర్, టౌన్ సిఐ భాస్కర్ ట్రాఫిక్ సిఐ కృష్ణ ఎస్సై యాదయ్య సురేందర్ పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.