ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా తుంగతుర్తి ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్ ను సన్మానించిన ఆర్యవైశ్య సంఘం
- సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్.
తుంగతుర్తి, ముద్ర: సీజనల్ వ్యాధుల పట్ల గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమని తుంగతుర్తి ఏరియా హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్ అన్నారు.ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు ఓరుగంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాచి చల్లార్చిన నీళ్లను తాగాలని, దోమలు లేకుండా చూసుకోవాలన్నారు.జలుబు దగ్గు జ్వర లక్షణాలు ఉన్నట్లయితే దవాఖానాలోని డాక్టర్లను సంప్రదించాలని కోరారు. మండల ఆర్యవైశ్యులు మా మీద నమ్మకంతో మమ్మల్ని సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజు, డాక్టర్ ఉపేందర్ డాక్టర్ మణిదీప్ డాక్టర్ వీణ ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు తాటికొండ సీతయ్య ,పోలవరపు సంతోష్, ఈగ లక్ష్మయ్య, తల్లాడ కేదారి తదితరులు పాల్గొన్నారు.